టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలిస్తే ఆస్ట్రేలియా క్రికెటర్ స్మిత్ పిల్లాడని అభిప్రాయపడ్డాడు భారత బౌలర్ శ్రీశాంత్. వారిద్దరి పోల్చి చూడటం సరికాదని అన్నాడు. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న ఇతడు.. 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సందర్భంగా విదేశీ లీగుల్లో ఆడటం, తన ఏడేళ్ల నిషేధం తదితర విషయాలు గురించి మాట్లాడాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు నచ్చరు
నేను కోహ్లీనే పెవిలియన్‌కు పంపాలని అనుకుంటాను. ఎందుకంటే విరాట్‌తో పోలిస్తే స్మిత్ పిల్లాడు. వారిద్దరిని పోల్చి చూడటం సరికాదు. కోహ్లీ స్థాయి వేరు. నేను అసలు ఆస్ట్రేలియా క్రికెటర్లకు మద్ధతుగా నిలవను. అది పాంటింగ్, స్మిత్ ఎవరైనా సరే. ఒకవేళ బుమ్రా, స్మిత్‌లతో ఎవరి బ్యాటింగ్ బాగుంది అంటే బుమ్రానే ఎంచుకుంటాను.
అఫ్రిదినీ ఔట్ చేయలేకపోయా
ఏ జట్టుతో ఆడినా సరే, కెప్టెన్‌ను ఔట్ చేయాలనుకుంటా. కానీ పాకిస్థాన్‌తో తలపడినప్పుడు మాత్రం ఆఫ్రిదినీ ఔట్ చేయలేకపోయా. అతడు బ్యాటింగ్‌కు దిగేసరికి, బౌలింగ్ చేస్తానని ఇర్ఫాన్ పఠాన్ ధోనీని అడిగేవాడు. దాంతో నాకు అవకాశం దక్కేదికాదు.