ఇంగ్లాండ్ క్రికెటర్ మాంటీ పనేసర్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాళ్లతో జట్లను తయారు చేశాడు. అయితే ఆ టీమ్‌లలో ఐసీసీ టాప్ ర్యాంకింగ్స్‌లో ఉన్న టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌లను టెస్టు ఎలెవన్ కోసం ఎంపిక చేయకపోవడం గమనార్హం. తాజాగా ఈ జట్లతో సహా పలు విషయాలను ఈటీవీ బారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు పనేసర్.
మాంటీ పనేసర్ టెస్టు జట్టులో మాథ్యూ హెడెన్, అలిస్టర్ కుక్‌లు ఓపెనర్లుగా, రిక్ పాంటింగ్‌ను కెప్టెన్‌గా తీసుకున్నాడు. తర్వాత స్థానాల కోసం సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లను ఎంపిక చేశాడు. బౌలింగ్ లైనప్‌లో షేన్ వార్న్, షాన్ పొల్లాక్, వసీం అక్రమ్, డారెన్ గాఫ్, జేమ్స్ అండర్సన్‌ల పేర్లు ప్రకటించాడు.
మాంటీ పనేసర్ ఉత్తమ టెస్టు ఎలెవన్
మాథ్యూ హెడెన్, అలిస్టర్ కుక్, రికీ పాంటింగ్ (కెప్టెన్), సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వాట్సన్, షాన్ పొల్లాక్, వసీం అక్రమ్, డారెన్ గాఫ్, జేమ్స్ అండర్సన్
పనేసర్ తయారు చేసిన వన్డే జట్టులో శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ సయీద్ అన్వర్‌లను ఓపెనర్లుగా తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస స్థానాల కోసం అరవింద డి సెల్వా, సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను ఎంచుకున్నాడు. కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేశాడు. బౌలింగ్ లైనప్‌లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీ.. స్పిన్నర్లలో హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్‌లు ఈ జట్టులో ఉన్నారు.