తెలంగాణ

telangana

ETV Bharat / sports

కుల్దీప్ యాదవ్ అలా చైనామన్ అయ్యాడు - కుల్దీప్ యాదవ్ ఈటీవీ భారత్

గతేడాది ఐపీఎల్​లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు. దీంతో టీమ్​ఇండియాకు స్థిరంగా ఎంపిక కాలేకపోయాడు. తాజాగా దీనిపై స్పందించారు అతడి చిన్ననాటి కోచ్ కపిల్ పాండే. ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల్దీప్ గురించి పలు విషయాలు పంచుకున్నారు కపిల్.

: Kuldeep Yadav'
కుల్దీప్ యాదవ్ అలా చైనామన్ అయ్యాడు

By

Published : Sep 25, 2020, 12:57 PM IST

కపిల్ పాండే ఇంటర్వ్యూ

టీమ్​ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్​ గతేడాది ఐపీఎల్​లో విఫల ప్రదర్శన చేశాడు. వికెట్లు తీయడంలో రాణించలేకపోయాడు. దీంతో టీమ్​ఇండియాలోనూ స్థిరంగా చోటు దక్కించుకోలేకపోయాడు. తాజాగా దీనిపై కుల్దీప్ చిన్ననాటి కోచ్ కపిల్ పాండే స్పందించారు. ప్రతి ఆటగాడు కెరీర్​లో ఎత్తుపల్లాలను చూస్తాడని తెలిపారు. దీంతో పాటు ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు.

కుల్దీప్ అకాడమీలో చేరినప్పటి విషయం గుర్తుతెచ్చుకుంటూ..

కపిల్: చిన్నప్పుడు నా దగ్గరికి కోచింగ్​ కోసం వచ్చినపుడు కుల్దీప్ బక్కపల్చగా ఉండేవాడు. అందుకే వాళ్ల నాన్న అతడిని అకాడమీలో చేర్పించాలనుకున్నారు. క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటాడని వాళ్ల నాన్న నమ్మాడు.

కుల్దీప్.. చైనామన్​గా ఎలా మారాడంటే

కపిల్: మొదట నాలుగు నెలల శిక్షణ అనంతరం కుల్దీప్​ను 'ఏమవ్వాలి అనుకుంటున్నావు' అని అడిగా. అతడు వసీం అక్రమ్​లా బౌలింగ్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ నేను ఒప్పుకోలేదు. స్పిన్నర్​గా ప్రయత్నించమని చెప్పా. అతడు వేసిన మూడు బంతుల తర్వాత అది చైనామన్​ బౌలింగ్ శైలిలా అనిపించింది. అదే శైలితో రాణించి, టీమ్​ఇండియాలోనూ చోటు సంపాదించాడు.

ఇంకా కుల్దీప్​తో టచ్​లో ఉన్నారా?

కపిల్: లాక్​డౌన్ ప్రారంభంలో వీడియో కాల్​ ద్వారా కుల్దీప్​తో మాట్లాడేవాడ్ని. నిబంధనలు సడలించాక నెట్స్​లో ప్రాక్టీస్​కు వచ్చాడు. మళ్లీ అతడు ఫిట్​గా మారేందుకు సాయపడ్డా.

ABOUT THE AUTHOR

...view details