తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ప్రశ్నకు సమాధానం చాలా కష్టం' - ఆల్​రౌండర్ విజయ్ శంకర్ వార్తలు

జట్టులోకి తిరిగి రావడంపైనే పూర్తి దృష్టి సారించానని యువ క్రికెటర్ విజయ్ శంకర్ అన్నాడు. అందుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్పాడు. గాయాల వల్ల ఇంట్లో కూర్చోవడం తన లాంటి ఆటగాళ్లకు చిరాకు తెప్పించే విషయమని తెలిపాడు.

EXCLUSIVE: It's important for me to keep performing, says Vijay Shankar
ఆ ప్రశ్నకు సమాధానం చాలా కష్టం: విజయ్ శంకర్

By

Published : Dec 8, 2020, 9:37 AM IST

'తిరిగి ఎప్పుడు జట్టులోకి వస్తావ్' అన్న ప్రశ్నకు సమధానమివ్వడం చాలా కష్టమని టీమ్​ఇండియా ఆల్​రౌండర్ విజయ్ శంకర్ చెప్పాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ తరఫున ఆడిన ఇతడు.. ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఈటీవీ భారత్​తో యువ ఆల్​రౌండర్ విజయ్ శంకర్
  1. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్రికెటర్ కల. అలాగే ఏ క్రికెటర్​కు అయినా జట్టులో చోటు కోల్పోవడం కష్టమైన విషయమే. జట్టులోకి రావాలనుకున్న ప్రతిసారి గాయాలు అడ్డంకిగా మారుతున్నాయి.
  2. గతేడాది దేశవాళీ సీజన్​తో పాటు భారత్-ఎ తరఫున న్యూజిలాండ్​లో బాగానే ఆడాను. ప్రతి మ్యాచ్​లో గొప్పగా ఆడాలనే ఆలోచన మాత్రమే ఉంది. జట్టులోకి ఎప్పుడు వస్తావు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం! కష్టపడటం, సన్నద్ధత మాత్రమే ప్రస్తుతం నా చేతుల్లో ఉన్నాయి.
  3. ఐపీఎల్​లో ఆడుతూ గాయమైంది. త్వరగా మైదానంలో దిగాలని అనుకుంటున్నా. ఎక్కువ రోజులు ఇంట్లోనే కూర్చోవడం క్రికెటర్లకు చాలా చిరాకు తెప్పించే విషయం. తిరిగి జట్టులోకి వచ్చి, బాగా ఆడటం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దేశవాళీ సీజన్​ కూడా నాలాంటి ఆటగాడికి చాలా కీలకం.
  4. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. బ్యాటింగ్ ఏ స్థానంలో చేయాలనే విషయం నా చేతుల్లో ఉండదు. హాఫ్ సెంచరీ, సెంచరీ చేయడం కంటే 10 బంతుల్లో 20 పరుగులు కొట్టినప్పుడే ఎక్కువ ఆనందపడతా.
    భారత ఆల్​రౌండర్ విజయ్ శంకర్

ABOUT THE AUTHOR

...view details