లాక్‌డౌన్‌తో ఇంతకాలం ఇంటికే పరిమితమైన భారత క్రికెటర్లు... ఐపీఎల్ 13వ సీజన్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో లీగ్ జరగనుంది. ఇప్పటికే జట్లన్నీ యూఏఈకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో ఈటీవీ భారత్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం.
లాక్డౌన్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడబోతుండటం ఎలా ఉంది?
లాక్డౌన్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. లాక్డౌన్ సమయం ఎంతో కష్టతరంగా గడిచింది. చాలా మంది ఎన్నో పెద్ద సమస్యలను ఎదుర్కొన్నారు. అవుట్డోర్ ప్రాక్టీస్ సెషన్, బౌలింగ్ వేయడాన్ని ఎంతగానో మిస్ అయ్యా. అయినప్పటికీ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఇండోర్ ప్రాక్టీస్ చేశా.
లాక్డౌన్లో మీ ఫిట్నెస్ను ఎలా కాపాడుకున్నారు?
ముందుగా నా డైట్ కంట్రోల్ చేశా. ఆహారపు అలవాట్లను నియంత్రణలో ఉంచుకుని.. అనంతరం డైట్ పాటించాలని నా కోచ్ ఓ సారి చెప్పాడు. ఉదయం, సాయంత్రం కసరత్తులు చేసి ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి సారించా. మొత్తంగా ఈ లాక్డౌన్ సమయాన్ని నా శరీరదారుఢ్యం కోసం వెచ్చించడం సంతోషంగా ఉంది.
ఐపీఎల్ కోసం ఎలా సన్నద్ధమయ్యారు?