సచిన్ తెందూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్.. ఈ దిగ్గజ జోడీ టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించింది. అయితే మాస్టర్‌తో మళ్లీ ఓపెనింగ్ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇందుకోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
"రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్'లో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. దీని కంటే పెద్ద విషయం, భద్రతపై అవగాహన పెంచడమే. ఇదో గొప్ప ముందడుగు. సచిన్‌తో ఓపెనింగ్ చేస్తూ.. బ్రెట్ లీని ఎదుర్కోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" - వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్.