తెలంగాణ

telangana

టీమ్​ఇండియాపై ప్రశంసల జల్లు- ఎవరేమన్నారంటే...

గబ్బా విజయం అనంతరం టీమ్​ ఇండియాకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. దిగ్గజాల నుంచి అభిమానుల వరకు భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

By

Published : Jan 19, 2021, 7:18 PM IST

Published : Jan 19, 2021, 7:18 PM IST

ex cricketers on india's win over australia in gabba
టీమ్​ఇండియాకు ప్రశంసల వెల్లువ.. ఎవరెవరు ఏమన్నారంటే

"కుడోస్‌ టీమిండియా! సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించారు. సగం జట్టు గాయాలతో దూరమైనా.. బయోబబుల్‌ వివాదాలు చుట్టుముట్టినా.. జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురైనా.. మీ విజయాన్ని ఎవరూ ఆపలేకపోయారు. తొలి టెస్టు ఓటమి అనంతరం దెబ్బతిన్న చిరుతలా విరుచుకుపడ్డారు. తమ అడ్డా అని గర్వంగా చెప్పుకునే గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించి.. భారత్‌ సత్తాని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు" అంటూ టీమ్​ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సునీల్ గావస్కర్

"ఇది కచ్చితంగా అద్భుతం. భారత క్రికెట్​కు మరపురాని అనుభూతి. వారు ఆటకు కాపాడుకోవడానికి మాత్రమే ఆడలేదు. సగర్వంగా వెనుదిరగాలని అనుకున్నారు. చేసి చూపించారు. నవభారత్​ దేనికీ భయపడదని చాటి చెప్పారు."

- సునీల్ గావస్కర్

"ఆనందంతో పిచ్చోడ్ని అయిపోయా. ఇది నవభారత్. వెన్ను చూపదు. అడిలైడ్​ నుంచి ఇప్పటివరకు జరిగింది చూస్తుంటే.. ఈ కుర్రాళ్లు జీవితకాలానికి సరిపడ ఆనందాన్ని ఇచ్చారు. ప్రపంచకప్​లు గెలిచాం. కానీ ఇది ప్రత్యేకం. పంత్​.. మరింత ప్రత్యేకం."

- వీరేంద్ర సెహ్వాగ్

"భారతీయుడిగా గర్వపడుతున్నా. వెయ్యి రెట్లు రోమాలు నిక్కపొడిచిన భావోద్వేగం ఇది."

- గౌతం గంభీర్

"గబ్బాలో ఆసీస్‌ రికార్డుకు చరమగీతం పాడారు. ఇది చరిత్ర. ఇది యువ భారత్‌ పోరాటం. ఇది గొప్ప టెస్టు విజయం. పంత్‌, సుందర్‌, గిల్, సిరాజ్ అద్భుత ప్రదర్శన చేశారు. అజింక్య రహానె నాయకుడై నడిపించాడు."

- హర్షా భోగ్లే

"టీమ్​ఇండియాకు చారిత్రక విజయం. అవసరమైన సమయంలో కుర్రాళ్లు అదరగొట్టారు. వారిని పంత్, గిల్ ముందుండి నడిపించారు. విజయంలో కీలకపాత్ర పోషించిన రవి శాస్త్రి, సహాయ సిబ్బందికి అభినందనలు. ఈ జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. చాలా కాలం రాణిస్తారు."

- వీవీఎస్ లక్ష్మణ్

"ప్రస్తుత తరంలో భారత్​కు అతిపెద్ద విజయం."

-ఇర్ఫాన్ పఠాన్

"ఏం జరిగినా ఎల్లప్పుడూ టీమ్'​ఇండియా' లాగే ఆడతాం. ఇలాంటి ప్రదర్శనలు మళ్లీ మళ్లీ రావు. ఛాంపియన్లకు వందనాలు."

-దినేశ్ కార్తీక్

"గొప్ప టెస్టు మ్యాచ్. భారత క్రికెట్ లోతు.. అద్వితీయం. పంత్.. చాలా బాగా ఆడావు."

-ఏబీ డివిలియర్స్

"ఈ విజయం భారత్​కు దక్కితీరాల్సిందే. ఎన్నో సవాళ్లను తట్టుకొని నిలబడ్డారు. ఆస్ట్రేలియా స్వీయ పరిశీలన చేసుకోవాలి."

-టామ్ మూడీ

ఇదీ చూడండి:టీమ్ఇండియా గెలుపు.. ఎందరికో మేలుకొలుపు !

ABOUT THE AUTHOR

...view details