ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న ప్రతిసారి రోమాలు నిక్కబొడుచుకునేవని, తమ జట్టంతా కుటుంబంలా అనిపించేదని అన్నాడు దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఇలాంటి వాతావరణాన్ని ఎక్కడా చూడలేదని చెప్పాడు.
'చెన్నైకి ఆడుతుంటే రోమాలు నిక్కబొడుచుకునేవి'
చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతుంటే, తనకు కుటుంబంలా అనిపిస్తుందని చెప్పాడు బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గూస్బంప్స్ వచ్చేవని అన్నాడు.
"సీఎస్కేకు ఆడిన ప్రతిమ్యాచ్‌లో నా రోమాలు నిక్కబొడుచుకునేవి. ఇది నిజంగా ప్రత్యేక అనుభవం. మేం జట్టుగా చాలా కష్టపడేవాళ్లం. ఎవరు సక్సెస్ అయినా సరే అందరం సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. అదే చెన్నై జట్టును ప్రత్యేకంగా నిలిపింది. ఈ ఫ్రాంచైజీలో సభ్యుడిని అయిన రోజును నా జీవితంలో మర్చిపోలేను. ఎందుకంటే ఆరోజు జట్టంతా నా కుటుంబంలా అనిపించింది. మరే ఫ్రాంచైజీలోనూ ఇలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. నా కొడుకు ఎప్పుడూ సీఎస్కే పాట పాడుతుంటాడు. ఐపీఎల్లో నేను మైదానంలో ఉండగా, వాడు ఆ మ్యాచ్ చూడటాన్ని బాగా ఇష్టపడతాడు" -ఇమ్రాన్ తాహిర్, చెన్నై సూపర్‌కింగ్స్ బౌలర్
2018లో చెన్నైలోకి వచ్చిన తాహిర్.. అప్పటి నుంచి జట్టుతో పాటే కొనసాగుతున్నాడు. గత సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ను కరోనా కారణంగా నిరవధిక వాయిదా వేశారు.