దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ సారథి డాన్ బ్రాడ్మన్ 112వ జయంతి నేడు(ఆగస్టు 27). ఈ సందర్భంగా స్మరించుకుని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు దిగ్గజ సచిన్ తెందుల్కర్. 1998లో బ్రాడ్మన్ 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలిపాడు.
"రెండో ప్రపంచ యుద్ధం వల్ల డాన్ బ్రాడ్మన్ చాలా ఏళ్ల పాటు క్రికెట్కు దూరమయ్యారు. అయినా సరే టెస్టుల్లో ఆయన బ్యాటింగ్ సగటు అందరికన్నా ఎక్కువగానే ఉంది. ఆయన జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. జన్మదిన శుభాకాంక్షలు డాన్ సార్"
-సచిన్ తెందుల్కర్, భారత మాజీ క్రికెటర్