తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ మ్యాచ్​లో ఏడవడంపై కుల్దీప్​ సమాధానమిదే - Kuldeep Yadav interview

టీమిండియా స్పిన్నర్​ కుల్దీప్​ యాదవ్​.. ఒకానొక సమయంలో తీవ్రమైన కుంగుబాటుకు గురైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఈ స్టార్​ క్రికెటర్​.. వాటితో సహా పలు ఆసక్తికర అంశాలపై సమాధానమిచ్చాడు. వాటిపై ఓ లుక్కేద్దాం.

EtvBharat EXCLUSIVE: Indian Spinner Kuldeep Yadav opens-up about Ipl Crying Scene
ఐపీఎల్​లో ఏడవడంపై కుల్దీప్​ ఏమన్నాడో తెలుసా..?

By

Published : Mar 11, 2020, 6:22 AM IST

ఈటీవీ భారత్​ ఇంటర్వ్యూలో కుల్దీప్​ యాదవ్​

టీమిండియా చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్​ యాదవ్‌ తన మణికట్టు మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను గందరగోళంలోకి నెట్టేస్తాడు. అద్భుతమైన బంతులతో ఉక్కిరిబిక్కిరి చేసి వికెట్లు పడగొడతాడు. పరుగులను నియంత్రిస్తాడు. అయితే ఇటీవల కాలంలో జట్టులో చోటు దక్కించుకునేందుకు, వికెట్లు తీసేందుకు కాస్త ఇబ్బందిపడుతున్నాడు. తాజాగా ఈటీవీ భారత్​తో ముచ్చటించిన అతడు.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

డిప్రెషన్​కు గురయ్యారా?

అండర్​-15లో చోటు దక్కనప్పుడు బాధపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే అవి అవాస్తవం​. అయితే భారత జట్టులో చోటు దక్కలేదని కాస్త నిరాశకు గురయ్యా.

కుల్దీప్​ యాదవ్​

కాన్పూర్​ ప్రత్యేకమా?

నా స్వస్థలం కాన్పూర్​. ఇక్కడే క్రికెట్​ పాఠాలు నేర్చుకున్నా. అందుకే ఈ ప్రాంతమంటే బాగా ఇష్టం. ఇప్పటికీ ఇక్కడ మైదానంలో బౌలింగ్​ చేస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది.

ధోనీ భాయ్​ దేశానికి చాలా చేశాడు. కచ్చితంగా అతడు జట్టులో లేకపోవడం లోటు. అందుకే చాలా మిస్​ అవుతున్నాం. అయితే కేఎల్​ రాహుల్​, రిషభ్​​ పంత్ కీపింగ్​, బ్యాటింగ్​లో​ మంచి ప్రదర్శన చేస్తున్నారు.

అప్పుడు ఏడ్చారా..?

గతేడాది ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​, కోల్​కతా నైట్​రైడర్స్​ మ్యాచ్​ జరిగింది. నా బౌలింగ్​లో ఆర్సీబీ బ్యాట్స్​మన్​ మొయిన్​ అలీ భారీగా పరుగులు రాబట్టాడు. నా ఓవర్​లో ఏకంగా రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదేశాడు. ఆ సమయంలో కాస్త భావోద్వేగానికి గురయ్యా కానీ ఏడవలేదు. గతేడాది ఐపీఎల్ నాకు పెద్దగా కలిసి రాలేదు. వికెట్లు తీయడానికి ఇబ్బందిపడ్డా. కానీ ఈ ఏడాది ఐపీఎల్​లో రాణించేందుకు బాగా సన్నద్ధం అవుతున్నాను.

ఐపీఎల్​లో కుల్దీప్​యాదవ్​

ABOUT THE AUTHOR

...view details