ప్రపంచ టాప్ 100 క్రీడాకారుల్లో మన దేశానికి చెందిన 9 మంది స్థానం సంపాదించుకున్నారు. అయితే 8 మంది క్రికెటర్లకు చోటు దక్కగా టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు స్థానం లభించింది. ఈ జాబితాలో ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. రెండు, మూడు స్థానాల్లో లెబ్రోన్ జేమ్స్, మెస్సీ కొనసాగుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ మూడు స్థానాల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కోహ్లి నాలుగు స్థానాలు మెరుగుపడి 7వ స్థానానికి చేరుకున్నాడు. మొదటి 10 మందిలో ఉన్న ఏకైక భారతీయుడిగా ఘనత సాధించాడు. మిస్టర్ కూల్ ధోనీ13వ స్థానంలో ఉన్నాడు.
విరాట్ కోహ్లి 7వ స్థానంలో ఉండగా...ఎం.ఎస్ ధోనీ (13), యువరాజ్ సింగ్ (18), సురేశ్ రైనా (22), రవిచంద్రన్ అశ్విన్ (42), రోహిత్‌శర్మ (46), హర్భజన్ సింగ్ (74, సానియా మీర్జా (93), శిఖర్ ధావన్ 94 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
క్రిస్టియానో రొనాల్డో (ఫుట్‌బాల్), లెబ్రోన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్), లియోనెల్ మెస్సీ (ఫుట్‌బాల్), నైమార్ (ఫుట్‌బాల్), కార్నర్ మెక్ గ్రెగర్ (మార్షల్ ఆర్ట్స్), రోజర్ ఫెదరర్ (టెన్నిస్), విరాట్ కోహ్లి (క్రికెట్), రఫెల్ నాదల్ (టెన్నిస్), స్టీఫెన్ క్యూరీ (బాస్కెట్‌బాల్), టైగర్ వుడ్స్ (గోల్ఫ్), కెవిన్ దురంత్( బాస్కెట్‌బాల్), పాల్ పోగ్బా( ఫుట్‌బాల్) తొలి 12 స్థానాల్లో ఉన్నారు.
టాప్-12 ర్యాంకిగ్స్‌లో ఆటగాళ్లు - ఈ 100 మంది జాబితాలో ముగ్గురు మహిళలు మాత్రమే చోటు సంపాదించారు. సెరెనా విలియమ్స్, సానియా మీర్జా, షరపోవా. ఈ ముగ్గురూ టెన్నిస్ క్రీడాకారిణులే కావడం విశేషం.
టాప్ 100లో ముగ్గురు మహిళలు
కొలమానం ఏంటి....??
ఈ జాబితాను మూడు అంశాల ఆధారంగా రూపొందించారు.
- అంతర్జాలంలో ఎంత మంది క్రీడాకారుల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.?
- ఎన్ని ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు.?
- సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్న వారి సంఖ్య.?
ఈ మూడింటి ఆధారంగా టాప్ వంద ర్యాంకులు ప్రకటించారు.