నగ్నంగా కీపింగ్ చేస్తూ.. కొన్ని రోజుల క్రితం అందరినీ ఆశ్చర్యపరిచిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా టేలర్ మరోసారి సంచలనం రేపింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ షాక్కు గురిచేసింది. మానసిక ఆందోళనతో బాధపడుతున్న ఆమె ఇకపై క్రికెట్ ఆడలేనని తెలిపింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
"2006లో నా కల నెరవేరింది. ఇన్నేళ్లలో నేను సాధించనదానిపట్ల గర్వపడుతున్నా. ఉత్తమ క్రీడాకారులతో కలిసి ఆడా. నా ఆరోగ్యం దృష్ట్యా వీడ్కోలు పలికేందుకు ఇదే మంచి సమయం అనుకుంటున్నా. ఇంగ్లాండ్ జెర్సీ ధరించి ఆడిన ప్రతీ నిమిషాన్ని ఆస్వాదించా. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" -సారా టేలర్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్