తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​కు కరోనా పాజిటివ్​ - పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో కరోనా కేసులు

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ టామ్​ బాంటన్​కు కరోనా సోకింది. ప్రస్తుతం పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో ఆడుతోన్న బాంటన్​.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయిన తర్వాత తనను ఐసోలేషన్​కు తరలించినట్లు తెలిపాడు.

England's Tom Banton tests COVID positive
ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​కు కరోనా పాజిటివ్​

By

Published : Mar 3, 2021, 9:14 PM IST

ఇటీవలే పాకిస్థాన్​ సూపర్​లీగ్​లో కరోనా సోకిన ఇద్దరు విదేశీ ఆటగాళ్లలో తానొకడినని ఇంగ్లాండ్​ బ్యాట్స్​మన్​ టామ్​ బాంటన్​ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తనను ఐసోలేషన్​లో ఉంచినట్లు తెలిపాడు. ఈ లీగ్​లో తాను ఆడుతోన్న క్వాట్టా గ్లాడియేటర్స్​ ఫ్రాంచైజీ ఐసోలేషన్​లో తనపై పత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిపాడు.

అయితే, బాంటన్​కు రాబోయే రోజుల్లో జరిపే కొవిడ్​ టెస్ట్​ల్లో మూడు సార్లు నెగెటివ్​ వచ్చిన తర్వాత అతడిని బయోబబుల్​లోకి అనుమతిస్తారు.

ప్రస్తుతం జరుగుతోన్న పీఎస్​ఎల్​లో మంగళవారం ముగ్గురికి కరోనా సోకినట్లు పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు స్పష్టం చేసింది. అందులో ఇద్దరు విదేశీ క్రికెటర్లతో పాటు ఒక సహాయక సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. అంతకు ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్​ ఫవాద్​ అహ్మద్​కు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి:ఇంగ్లాండ్​ క్రికెటర్లకు డయేరియా.. కానీ!

ABOUT THE AUTHOR

...view details