2019 ప్రపంచకప్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్. ఈ టోర్నీలో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన రాయ్ తొలిసారిగా టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ప్రపంచకప్‌లో సత్తాచాటిన రాయ్.. టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని ఇంగ్లాండ్ సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ ఫార్మాట్లోనూ రాయ్ విజయవంతమైతే ఇంగ్లీష్ జట్టు మరింత బలోపేతం అవుతుంది. ఆ జట్టు ఓపెనర్ బర్న్స్‌తో కలిసి రాయ్ ఓపెనింగ్ చేయనున్నాడు.