ఇంగ్లాండ్ జట్టు 'రొటేషన్ పాలసీ'పై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ జట్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని వెనకేసుకొచ్చాడు దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్. ఈ నిర్ణయంతో ఇంగ్లాండ్ జట్టు ఉత్తమ క్రికెటర్ల బృందాన్ని సిద్ధం చేస్తోందని అన్నాడు.
"ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల కీలకమైన సిరీస్లకు ఉత్తమ ఆటగాళ్లు దూరమవుతున్నారు కావొచ్చు. కానీ, రానున్న రోజుల్లో ఐసీసీ ఈవెంట్ల కోసం జట్టు సభ్యులను ఎంపిక చేయడం చాలా సులువవుతుంది. ఈ రొటేషన్ పాలసీతో 'ఆర్మీ ఆఫ్ అమేజింగ్ క్రికెటర్స్' బందాన్ని తయారు చేస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు."