ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఏ ఫాస్ట్ బౌలర్‌కు సాధ్యం కాని ఘనతను సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 600 వికెట్లు దక్కించుకున్న తొలి పేసర్‌గా రికార్డులకెక్కాడు. ఇతడి దరిదాపుల్లో కూడా ఏ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం గమనార్హం.
ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ రికార్డు మొత్తంగా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు అండర్సన్. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
600 వికెట్లు సాధించిన బౌలర్లు 600 వికెట్లలో భారత బ్యాట్స్‌మెన్‌నే ఎక్కువసార్లు ఔట్ చేశాడు అండర్సన్. ఇందులో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌వి 110 వికెట్లు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాపై 104 వికెట్లు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికాపై 83, వెస్టిండీస్‌పై 87 వికెట్లు సాధించాడు. అలాగే సొంతగడ్డపై 384 వికెట్లను తీశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 50కి పైగా వికెట్లు పడగొట్టాడు.
టెస్టుల్లో 500కు మించి వికెట్లు సాధించిన వారిలో గ్లేన్ మెక్‌గ్రాత్ (563), వాల్ష్ (519), స్టువర్ట్ బ్రాడ్ (511) ఉన్నారు. ఇందులో బ్రాడ్ మాత్రమే ఇంకా క్రికెట్లో కొనసాగుతున్నాడు.