కరోనా కారణంగా కొద్ది నెలలుగా క్రికెట్‌కు విరామం లభించింది. ఈ మధ్యే ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సిరీస్ దిగ్విజయంగా పూర్తయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లీష్ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా విజ్డెన్ ట్రోఫీ ఇంగ్లాండ్‌కు దక్కింది.
చివరిదైన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 129 పరుగులకే ఆలౌటైంది.. ఫలితంగా 269 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ భారీ విజయం దక్కించుకుంది. క్రిస్ వోక్స్ 5, స్టువర్ట్ బ్రాడ్ 4 వికెట్లతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన బ్రాడ్ ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు సాధించాడు. ఈ ఘనత సాధించడం ఇతడికిది మూడోసారి. తద్వారా మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గానూ ఎంపికయ్యాడు.