భారత క్రికెటర్ల ఇన్ స్టా పోస్టులను తరచూ పాలో అవుతుంటుంది ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డానియల్లి యాట్. ఇటీవల జస్ప్రీత్ బుమ్రా జిమ్ పొస్టుకు.. 'చిన్నపిల్లల ఎక్సర్సైజు చేస్తున్నావేంటీ' అని టీజ్ చేసిన యాట్.. ఇప్పుడు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను కామెంట్ చేసింది.
విండీస్‌తో జరిగిన తొలి వన్డే అనంతరం కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఎత్తు చూసుకుంటూ దిగిన ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు చాహల్. ఈ పోస్టుపై స్పందించిన ఇంగ్లీష్ క్రికెటర్ 'నువ్వు నా కంటే ఎత్తు తక్కువ అనుకుంటా' అని కామెంట్ పెట్టింది. అంతేకాకుండా ఆ సందేశానికి లాఫింగ్ ఎమోజీని జత చేసింది.