వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సిరీస్లకు దూరంగా ఉన్నాడు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందుకోసం జిమ్లో తేలికపాటి కసరత్తులు మొదలుపెట్టాడు. తాజాగా "త్వరలో వచ్చేస్తున్నా" అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. దీనిపై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్లీ వ్యాట్ స్పందించింది.
బుమ్రాను టీజ్ చేసిన ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ - బుమ్రాను టీజ్ చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్
టీమిండియా పేసర్ బుమ్రాను ఆటపట్టించింది ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్లీ వ్యాట్. ఇన్స్టాలో అతడి ఫొటోకు సరదాగా రిప్లే ఇచ్చి టీజ్ చేసింది.
బుమ్రా
"బేబీ వెయిట్స్" (తక్కువ బరువులు) అంటూ బుమ్రాను టీజ్ చేసింది వ్యాట్. ఎందుకంటే గాయం నుంచి కోలుకుంటున్న అతడు ప్రస్తుతం తక్కువ బరువులతో కసరత్తులు చేస్తున్నాడు. గతంలో తనను పెళ్లి చేసుకోవాలని కోహ్లీని కోరి వార్తల్లో నిలిచిందీ క్రికెటర్.
ఇవీ చూడండి.. రవిశాస్త్రి సేవలు అందుకోసం వాడుకుంటాం: దాదా