213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. గాయం కారణంగా రాయ్ ఓపెనింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో వచ్చిన రూట్.. మరో ఓపెనర్ బెయిర్ స్టోతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో మొదటి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిందీ జోడి. 45 పరుగులు చేసిన స్టో... గాబ్రియల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అనంతరం వోక్స్‌తో కలిసి రూట్ మరింత వేగంగా ఆడాడు. 94 బంతుల్లో 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇప్పటివరకు 3 సెంచరీలు చేసిన రూట్.. ఈ ఘనత సాధించిన తొలి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. విశేషమేంటంటే ఈ వరల్డ్‌కప్‌లోనే రెండు సెంచరీలు చేశాడీ క్రికెటర్.
వోక్స్ 40, స్టోక్స్ 10* పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో 2 వికెట్లు గాబ్రియలే తీశాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. ఏ దశలోనూ ధాటిగా ఆడలేకపోయింది. చక్కని లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులేసిన ఇంగ్లీష్ బౌలర్లు బ్యాట్స్మెన్లను పరుగులు చేయకుండా నియంత్రించారు. నికోలస్ పూరన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.