భారత్‌పై వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయినప్పటికీ.. తమ టీమ్ భయపడదని ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఈ పరాభవం వేరే జట్లకు ఎదురైతే ఆ టీమ్‌లలో చాలా మార్పులు జరగేవని పేర్కొన్నాడు. కానీ ఇంగ్లాండ్‌కు అలా కాదని వెల్లడించాడు.
"ప్రస్తుత సిరీస్ ఓటముల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. చాలా కాలంగా మేము మెరుగైన క్రికెట్‌ను ఆడుతున్నాం. మంచి స్థితిలో ఉన్నాం" అని బట్లర్ పేర్కొన్నాడు.
"ఈ సిరీస్ ద్వారా కొంతమంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. రానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత పిచ్‌లపై మాకు అవగాహన వచ్చింది. 2021 పొట్టి వరల్డ్‌కప్‌తో పాటు 2023 ప్రపంచకప్ భారత్‌లోనే జరగనున్నాయి. సామ్ కరన్, లివింగ్‌స్టోన్ వంటి అద్భుత క్రికెటర్లు ఇక్కడి వికెట్‌పై రాణించడం జట్టుకు శుభపరిణామం" అని బట్లర్ తెలిపాడు.