తెలంగాణ

telangana

ETV Bharat / sports

మోకాళ్లపై కూర్చొని ఫ్లాయిడ్​ మృతికి క్రికెటర్ల సంఘీభావం - బ్లాక్​ లైవ్స్​ మ్యాటర్​

జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలిపారు ఇంగ్లాండ్​-వెస్టిండీస్ క్రికెటర్లు. పోలీసుల కర్కశానికి బలైన నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్​ మరణానికి చింతిస్తూ.. ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్లపై కూర్చొని కాసేపు మౌనం పాటించారు. ​

England, West Indies take a knee ahead of 1st cricket test
మోకాళ్లపై కూర్చొని జాతివివక్షపై క్రికెటర్ల సంఘీభావం

By

Published : Jul 8, 2020, 8:56 PM IST

Updated : Jul 8, 2020, 9:18 PM IST

సౌథాంప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో 'బ్లాక్​ లివ్స్​ మేటర్​​​' ఉద్యమానికి సంఘీభావం తెలిపారు క్రికెటర్లు. జాతివివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు తెలుపుతూ.. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో మోకాళ్లపై కూర్చొని కొంతసేపు మౌనం వహించారు.

ఇన్నింగ్స్​లో మొదటి బంతి వేయడానికి ముందు మైదానంలో వెస్టిండీస్​ ఆటగాళ్లతో పాటు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్లు, అవుట్​ఫీల్డ్​లో సిబ్బంది మోకరిల్లి ఫ్లాయిడ్ నిరసనలకు మద్దతుగా నిలిచారు. మే నెలలో అమెరికాలోని నల్లజాతీయుడు జార్జ్​ ఫ్లాయిడ్​.. పోలీసుల కర్కశత్వం కారణంగా మృతి చెందాడు. ఆయన మరణానికి సంఘీభావంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

వర్షం చాటున తొలి రోజు

వర్షం కారణంగా మ్యాచ్​ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత టాస్​ గెలిచిన ఇంగ్లాండ్​ బ్యాటింగ్​ ఎంచుకుంది. రెండో ఓవర్​లోనే ఇంగ్లీష్​ జట్టు సిబ్లే రూపంలో తొలి వికెట్​ కోల్పోయింది. మూడు ఓవర్ల తర్వాత మళ్లీ చిరు జల్లుల కారణంగా మ్యాచ్​కు అంతరాయం ఏర్పడింది . ఇలా మ్యాచ్​ ముందుకు సాగకుండా వర్షం ఆటంకం కలిగిస్తోంది. ​టీ విరామానికి ఇంగ్లాండ్​ ఒక వికెట్​ నష్టపోయి 35 పరుగులు చేసింది. బర్న్స్​(20), డెన్లీ(14) క్రీజులో ఉన్నారు. గాబ్రియెల్​ ఒక వికెట్​ తీశాడు.

ఇదీ చూడండి... ఆసియా కప్​-2020 రద్దు.. గంగూలీ ప్రకటన

Last Updated : Jul 8, 2020, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details