సౌతాంఫ్టన్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్- వెస్టిండీస్ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 212 పరుగులు చేసింది విండీస్. జట్టులోని నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేసి 63 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్, రూట్ తలో రెండు వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ మూడో ఓవరలో ఓపెనర్ లూయిస్ వికెట్ కోల్పోయింది. తర్వాత కొంతసేపు ధాటిగా ఆడిన గేల్.. 36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఓ ఎండ్‌లో నిలకడగా ఆడుతున్నా.. అతడికి సహకారమందించే వారు కరవయ్యారు. కొద్దిసేపు క్రీజులో నిలిచిన హెట్మయిర్ 39 పరుగులు చేసి వెనుదిరిగాడు.
వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్
మిగతా వారిలో హోప్ 11, హోల్డర్ 9, రసెల్ 21, కాట్రల్ 0, గాబ్రియెల్ 0, బ్రాత్‌వైట్ 14 పరుగులు చేశారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్ తలో మూడు వికెట్లు తీశారు. పార్ట్‌టైమ్ బౌలర్ రూట్ రెండు వికెట్లతో అదరగొట్టాడు.
వికెట్ తీసిన ఆనందంలో ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్