తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాడ్​ X విండీస్​: తొలిరోజు వరుణుడి ఆధిపత్యం

కరోనా నేపథ్యంలో సుమారు నాలుగు నెలల తర్వాత క్రికెట్​ మ్యాచ్​ నిర్వహిస్తోంది ఐసీసీ. క్రికెట్​ చరిత్రలోనే తొలిసారిగా అభిమానులు లేకుండా టెస్ట్​ మ్యాచ్​లో ఇంగ్లండ్​, వెస్టిండీస్​ జట్లు తలపడుతున్నాయి. అయితే బుధవారం ప్రారంభమైన మ్యాచ్​లో తొలిరోజు వరణుడి అధిపత్యం సాగింది. ఈ మ్యాచ్​లో 17 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.

England vs West indies
ఇంగ్లాడ్​ X విండీస్​: తొలిరోజు వరుణుడి ఆధిపత్యం

By

Published : Jul 9, 2020, 5:34 AM IST

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆట మెుదలైంది. కరోనా మహమ్మారితో నాలుగు నెలలుగా నిలిచిపోయిన క్రికెట్.. కట్టుదిట్టమైన ఆరోగ్య భద్రతల మధ్య మళ్లీ ప్రారంభమైంది. అంతర్జాతీయ క్రికెట్​ సంఘం(ఐసీసీ) కరోనా నిబంధనలకు లోబడి ఇంగ్లండ్, వెస్టిండీస్​ జట్ల మధ్య మూడు టెస్ట్​ల సిరీస్​లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా తొలి టెస్ట్​ మ్యాచ్​ బుధవారం ఆరంభమైంది. 143 ఏళ్ల క్రికెట్​ చరిత్రలో మైదానంలో అభిమానులు లేకుండానే ఈ మ్యాచ్​ను నిర్వహిస్తున్నారు.

వరణుడి ఆధిపత్యం

కరోనాకు ఎదురునిలిచి దాదాపు 4 నెలల తర్వాత ప్రారంభమైన తొలి అంతర్జాతీయ టెస్ట్​ మ్యాచ్​పై వరుణుడు తొలిరోజు ప్రతాపం చూపాడు. వర్షం కారణంగా టాస్ ఆలస్యంగా పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఇంగ్లాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. గాబ్రియల్ బౌలింగ్​లో సిబ్లే డకౌట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో 17 ఓవర్ల పాటు మాత్రమే మ్యాచ్ సాగగా.. బర్న్స్, డెన్లీ మరో వికెట్ పడకుండా 35 పరుగులు చేశారు. బర్న్స్​ 55 బంతుల్లో 20 పరుగులు చేయగా.. డెన్లీ 48 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట నిలిచిపోయింది.

ఫ్లాయిడ్​కు సంతాపం

ఇంగ్లాండ్, వెస్టిండీస్​ జట్లు.. మ్యాచ్​ ప్రారంభానికి ముందు అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతికి సంఘీభావం తెలిపారు. ఇరు జట్ల ఆటగాళ్లు మోకాళ్ల మీద కూర్చొని జార్జి​ ఫ్లాయిడ్​ మృతికి శాంతి కలగాలని మౌనం పాటించారు.

ఇదీ చదవండి:మోకాళ్లపై కూర్చొని ఫ్లాయిడ్​ మృతికి క్రికెటర్ల సంఘీభావం

ABOUT THE AUTHOR

...view details