తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్‌-పాక్‌: వరుణుడి దెబ్బకు రెండో టెస్టు 'డ్రా' - england vs pakistan cricket news

ఇంగ్లాండ్​ను మరో టెస్టు సిరీస్​ ట్రోఫీ ఊరిస్తోంది. పాకిస్థాన్​తో జరుగుతున్న రెండో టెస్టు డ్రా కావడం వల్ల మూడో టెస్టు కీలకంగా మారింది. ఈ మ్యాచ్​ను డ్రా చేసినా.. గెలిచినా టైటిల్​ ఇంగ్లీష్​ జట్టునే వరించనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉంది ఇంగ్లాండ్​.

england vs pakistan latest news
ఇంగ్లాండ్‌-పాక్‌: వరుణుడి దెబ్బకు రెండో టెస్టు 'డ్రా'

By

Published : Aug 18, 2020, 8:27 AM IST

సౌథాంప్టన్​ వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌-పాకిస్థాన్‌ రెండో టెస్టు పేలవమైన డ్రాగా ముగిసింది. మ్యాచ్‌ చివరి రోజు, సోమవారం కూడా వర్షం వెంటాడింది. ఎట్టకేలకు ఓవర్‌నైట్‌ స్కోరు 7/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌.. ఫలితం తేలే అవకాశం లేకపోవడం వల్ల 110/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ స్థితిలో రెండు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో క్రాలే (53) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడు సిబ్లేతో కలిసి రెండో వికెట్‌కు 91 పరుగులు జత చేశాడు. అయితే వీళ్లిద్దరూ రెండు ఓవర్ల తేడాతో ఔట్‌ కావడం వల్ల ఇంగ్లాండ్‌ 92/3తో నిలిచింది. ఈ రెండు వికెట్లను పేసర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ (2/28) ఖాతాలో వేసుకున్నాడు. పోప్‌ (9) కూడా త్వరగానే ఔటయ్యాడు. కెప్టెన్‌ రూట్‌ (9).. బట్లర్‌ (0)తో కలిసి నాటౌట్‌గా నిలిచాడు.

పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు అడ్డుపడిన వరుణుడు.. మూడో రోజు ఆటను పూర్తిగా తుడిచి పెట్టేశాడు. నాలుగోరోజూ కూడా కొన్ని ఓవర్ల ఆటే సాగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టును గెలుచుకున్న ఇంగ్లాండ్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్‌లో ఆఖరిదైన మూడో టెస్టు శుక్రవారం సౌథాంప్టన్‌లోనే ఆరంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details