తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ తర్వాత మళ్లీ తలపడిన కివీస్​-ఇంగ్లాండ్​ - James Vince, Jonny Bairstow, Mitchell Santner

ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​ జట్ల మధ్య ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​ ప్రారంభమైంది. ప్రపంచకప్​ ఫైనల్​ తర్వాత తొలిసారి ఇరుజట్లు పోటీపడ్డాయి. అయితే ఆరంభ మ్యాచ్​లోనే విజయం సాధించింది వరల్డ్​కప్​ ఛాంపియన్​.

ప్రపంచకప్​ తర్వాత మళ్లీ తలపడిన కివీస్​-ఇంగ్లాండ్​

By

Published : Nov 1, 2019, 2:50 PM IST

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్​ తర్వాత ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్లు మరోసారి తలపడ్డాయి. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్‌లో భాగంగా ఓవల్​ వేదికగా శుక్రవారం తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్​లో ఇంగ్లీష్‌ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు... కివీస్‌ను 153/5కు పరిమితం చేసింది. న్యూజిలాండ్​ బ్యాట్స్​మెన్లు రాస్‌ టేలర్‌(44), టిమ్‌ సీఫెర్ట్‌(32) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌... 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బెయిర్​ స్టో(35), జేమ్స్ విన్స్‌(59; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇయాన్‌ మోర్గాన్‌(34*; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడం వల్ల మొదటి మ్యాచ్​లో ఇంగ్లాండ్‌ శుభారంభం చేసింది. ఫలితంగా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ రెండు జట్ల మధ్య తర్వాత టీ20 మ్యాచ్​.. నవంబర్​ 3(ఆదివారం)న జరగనుంది. ఐదు మ్యాచ్​ల పొట్టి ఫార్మాట్​ సిరీస్​ తర్వాత ఇరుజట్లు రెండు టెస్టులు ఆడనున్నాయి.

ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగినప్రపంచకప్‌ ఫైనల్​ను ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోలేరు. తొలుత ఇరు జట్ల సోర్లు సమంకాగా.. సూపర్​ ఓవర్​ నిర్వహించారు. అందులోనూ చెరో 15 పరుగులు చేయగా.. బౌండరీ కౌంట్​ ద్వారా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు. అలా తొలిసారి 50 ఓవర్ల ప్రపంచకప్​ ట్రోఫీని ముద్దాడింది. ఆ ఫైనల్​ తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details