మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా.. వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. సౌథాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు సిరీస్ సొంతం చేసుకుంది.
ఇంగ్లాండ్‌పై గెలుపు.. ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ మిస్ - ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా టీ20
మూడో టీ20లో ఆసీస్ జట్టు ఐదు పరుగుల తేడాతో గెలిచింది. కానీ 1-2 తేడాతో సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయింది. కానీ టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు రెండో మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లాండ్.. నం.1 ర్యాంక్‌కు వెళ్లింది.
![ఇంగ్లాండ్‌పై గెలుపు.. ఆస్ట్రేలియాకు వైట్‌వాష్ మిస్ England vs Australia 3rd T20I](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8733378-763-8733378-1599623990019.jpg)
మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో తొలుత ఓడి, బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. బెయిర్‌స్టో(55), మొయిన్ అలీ(23), జో డెన్లీ(29 నాటౌట్) రాణించారు.
ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడారు. కెప్టెన్ ఫించ్ 39, మిచెల్ మార్ష్ 39 నాటౌట్, స్టాయినిస్ 26 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది కంగారూ జట్టు. శుక్రవారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా వన్డే సిరీస్ జరగనుంది.