టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. రోజంతా 88 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. ఒక్కటంటే ఒక్క అదనపు పరుగూ ఇవ్వకపోవడం విశేషం.
భారత్ చేసిన 300 రన్స్‌లో.. రోహిత్(161), రహానె(67), పుజారా(21), అశ్విన్(13), పంత్(33*), అక్షర్(5*) పరుగుల చొప్పున చేశారు. ఈ తొలిరోజు ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే లేవు.
భారత్ బౌలర్లు విఫలమైన చోటే..
ఇదే చెపాక్ పిచ్‌పైనే తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారీగా అదనపు పరుగులు సమర్పించుకున్నారు భారత బౌలర్లు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 45 ఎక్స్ట్రా రన్స్ ఇవ్వగా.. అందులో నో బాల్స్-20, లెగ్ బైస్-17 ఉన్నాయి. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్ దాడితో టీమ్ఇండియా భరతం పట్టిన పర్యటక జట్టు.. కేవలం 6 అదనపు పరుగులే ఇచ్చింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య టీమ్ పర్వాలేదనిస్తూ.. 7 ఎక్స్‌ట్రాలే ఇచ్చింది. ప్రత్యర్థి జట్టు మాత్రం 14 అదనపు పరుగులు సమర్పించుకుంది.
ఇవీ చదవండి:
చెన్నై టెస్టు: తొలి రోజు ఆట పూర్తి- టీమ్ఇండియా 300/6
సవాళ్లు విసిరే పిచ్‌పై దుమ్మురేపిన హిట్‌మ్యాన్!