భారత్‌లో జరుగనున్న టెస్టు సిరీస్ కోసం తమ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు ఇంగ్లాండ్ మాజీ బౌలర్ గ్రేమ్ స్వాన్. స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేస్తే వికెట్లు సులభంగా వస్తాయని సూచించాడు. తుది జట్టులో జాక్ లీచ్‌కు స్థానం కల్పిస్తే.. అతడు ఈ పర్యటనలో కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు.
"ప్రస్తుత శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్ తొలి టెస్టు గెలిచింది. అందులో లీచ్, డామ్ బెస్ స్పిన్ ద్వయం కీలక పాత్ర పోషించింది. ఇరువురూ చెరో 5 వికెట్లతో మెరిశారు. అదే రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మాత్రం వీరిద్దరు ప్రభావం చూపలేకపోయారు" అని ఈ వెటరన్ స్పిన్నర్ తెలిపాడు.
నేను తీసుకున్న మొత్తం 255 టెస్టు వికెట్లలో 60 భారత్‌లో తీసినవే. శ్రీలంక, బంగ్లాదేశ్‌లలోనూ 25 సగటుతో వికెట్లు పడగొట్టాను. 2008 నుంచి 2013 మధ్య కాలంలో 60 టెస్టులు ఆడిన నాకు.. ఉపఖండం పిచ్‌లపై వికెట్ల తీయడం చాలా బాగా తెలుసు.
-గ్రేమ్ స్వాన్, ఇంగ్లాండ్ మాజీ స్పిన్ బౌలర్.
"నేను చెప్పదల్చుకుంది ఒకటే విషయం. అవి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు. అవన్నీ ఫ్లాట్ పిచ్‌లు. మీరు బౌలింగ్ బాగా చేస్తే చాలు. ముఖ్యంగా ఇండియాతో ఆడుతున్నప్పుడు.. వాళ్లు చాలా గౌరవంగా ఆడుతారు. ప్రస్తుత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ లేడు. విరాట్ కోహ్లి ఉన్నప్పటికీ అతడు స్పిన్ బౌలింగ్‌లో చెత్త బంతి కోసమే వేచి చూస్తాడు" అని స్వాన్ పేర్కొన్నాడు.
ఇండియా కంటే ఓపికగా ఆడాలి..