ఇటీవలే ప్రపంచకప్ గెలిచి జోష్ మీదున్న ఇంగ్లాండ్ మరో విజయంపై కన్నేసింది. మేమేం తక్కువ కాదంటూ ఆస్ట్రేలియా సిద్ధమవుతోంది. ఈ రెండు జట్లు.. ఇంగ్లీష్ గడ్డపై ప్రఖ్యాత యాషెస్‌లో తలపడనున్నాయి. గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌కు ఎడ్బాస్టన్ వేదిక కానుంది.
ఇరు జట్లు కెప్టెన్లు రూట్(ఇంగ్లాండ్), టిమ్ పైన్(ఆస్ట్రేలియా) ఇంగ్లాండ్ విజయాల పరంపర కొనసాగేనా..!
రూట్ నాయకత్వంలో ఈ సంప్రదాయ ఫార్మాట్‌ను విజయంతో ఆరంభించేందుకు కసరత్తులు చేస్తోంది ఇంగ్లాండ్. 2001 తర్వాత ఇంగ్లీష్ గడ్డపై యాషెస్ సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా గెలవకపోవడం వీరికి కలిసొచ్చే విషయం. ఇప్పుడూ అదే ఫామ్ కొనసాగించాలని చూస్తోంది రూట్ సేన.
ఆర్చర్‌కు దక్కని చోటు
ప్రపంచకప్‌లో తన ప్రదర్శనతో యాషెస్‌కు ఎంపికైన ఆర్చర్.. తొలి మ్యాచ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ ప్రకటించిన జట్టులో అతడ్ని తీసుకోలేదు. పేస్ బాధ్యతల్ని అండర్సన్‌తో పాటు బ్రాడ్, వోక్స్, స్టోక్స్ పంచుకోనున్నారు.
ఆస్ట్రేలియా అద్భుతం చేస్తుందా..!
గతేడాది బాల్ టాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన ముగ్గురు క్రికెటర్లు స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్.. యాషెస్ తొలి టెస్టులో ఆడుతున్నారు. వీరు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి. జట్టులోని మిగతా క్రికెటర్లు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
టిమ్ పైన్ నాయకత్వం వహిస్తున్న ఈ జట్టు గత రికార్డులు చెరిపేందుకు సమాయత్తమవుతోంది. ప్రపంచకప్ సెమీస్‌లో ఇదే ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓడిన ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
జట్లు
ఇంగ్లాండ్: జో రూట్(కెప్టెన్), జేసన్ రాయ్, రోరి బర్న్స్, జో డెన్లీ, జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్
ఆస్ట్రేలియా(అంచనా):డేవిడ్ వార్నర్, ఖవాజా, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, టిమ్ పైన్(కెప్టెన్), నాథన్ లయన్, పీటర్ సిడెల్, జేమ్స్ పాటిన్సన్, జోస్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్
ఇవీ చదవండి: