తెలంగాణ

telangana

ETV Bharat / sports

పట్టు బిగించిన ఇంగ్లాండ్​.. భారీ ఆధిక్యం దిశగా - ఇంగ్లాండ్

బర్మింగ్​హామ్ వేదికగా ఆసీస్​తో జరుగుతోన్న యాషెస్ సిరీస్​లో ఇంగ్లాండ్​ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రోరీ బర్న్స్​ (127) సెంచరీ, రూట్ (57) అర్ధశతకాలు సాధించగా.. ఇంగ్లాండ్ 4 వికెట్లకు 267 పరుగులు చేసింది.

బర్న్స్​

By

Published : Aug 3, 2019, 7:52 AM IST

Updated : Aug 3, 2019, 8:30 AM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోరు 10/0 తో ఉన్న ఇంగ్లీష్ జట్టు రెండో రోజు పై చేయి సాధించింది. ఓపెనర్ రోరీ బర్న్స్​ (125) సెంచరీతో విజృంభించి.. బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ జోయ్ రూట్ (57) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో జేమ్స్ ప్యాటిన్సన్ రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, సిడిల్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది.

ఓవర్​నైట్ స్కోరు 10/0 తో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే జేసన్ రాయ్ (10) వికెట్ కోల్పోయింది. అప్పటికీ జట్టు స్కోరు 22 పరుగులే. అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్ - బర్న్స్​ జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది. వీరిద్దరూ 132 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

బర్న్స్​ బర్నింగ్..

కెరీర్​లో తొలి సెంచరీ నమోదు చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్​ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించాడు. 282 బంతుల్లో 125 పరుగులు చేసి ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఇందులో 16 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం బెన్ స్టోక్స్​తో (38) కలిసి ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు. వీరిద్దరూ ఇప్పటికే 73 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ ఇలాగే ఆడితే భారీ ఆధిక్యం సాధించడం ఖాయం.

శతకం అనంతరం రోరీ బర్న్స్​

రెండు సార్లు బతికిపోయిన రూట్​..

ఇంగ్లీష్ కెప్టెన్ జోయ్ రూట్ ఔట్​ నుంచి రెండు సార్లు తప్పించుకున్నాడు. ఆసీస్ బౌలర్ ప్యాటిన్సన్ బౌలింగ్​లో బంతి రూట్ బ్యాట్​కు దగ్గరగా వెళ్లింది. శబ్దం విన్న అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే రూట్ సమీక్ష కోరగా.. బ్యాట్​ తాకనట్లుగా తేలింది. అల్ట్రా ఎడ్జ్​లో వచ్చిన శబ్దం బంతి స్టంప్​ను తాకినపుడు వచ్చిందని తేలింది. బెయిల్​ కింద పడని కారణంగా రూట్​ను అంపైర్​ నాటౌట్​గా ప్రకటించాడు. సిడిల్ బౌలింగ్​లో అంపైర్​ రూట్​ను ఎల్బీడబ్ల్యూగా తేల్చాడు. మళ్లీ రివ్యూ వాడి రూట్ బతికిపోయాడు.

రూట్

మొదట బ్యాటింగ్ చేసిన కంగారూ జట్టు 284 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (144) సెంచరీతో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 5 వికెట్లతో విజృంభించగా.. క్రిస్ వోక్స్ 3, స్టోక్స్ ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇది చదవండి: టీ-20: విండీస్​తో భారత్​ అమీతుమీ

Last Updated : Aug 3, 2019, 8:30 AM IST

ABOUT THE AUTHOR

...view details