దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌ను 9 వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. సఫారీలు నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. డేవిడ్ మలన్(99 నాటౌట్), జాస్ బట్లర్(67 నాటౌట్) విజయంలో కీలకపాత్ర పోషించారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. డికాక్(17), బవుమా(32), హెండ్రిక్స్(13), డుప్లెసిస్(52 నాటౌట్), వాండర్సెన్(74 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో స్టోక్స్ 2, జోర్డాన్ 1 వికెట్ తీశారు.