ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కరోనా ప్రభావంతో రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ఇరుదేశాల బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశాయి.
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ రద్దు.. కారణమదే? - ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా కరోనా కేసులు
ఆటగాడితో పాటు పలువురు సిబ్బందికి కరోనా సోకడం వల్ల మొత్తం సిరీస్‌నే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఆటగాళ్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని ఇరుదేశాల బోర్డులు వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం గత శుక్రవారం(డిసెంబరు 4) తొలి వన్డే జరగాలి. కానీ అదే రోజు ఉదయం ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో తొలి వన్డేను ఆదివారానికి(డిసెంబరు 6) వాయిదా వేశారు. అప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్ సిబ్బందిలో ఇద్దరికి కొవిడ్ సోకినట్లు తేలింది.
అనంతరం ఇంగ్లాండ్ బృందంలోని ఇద్దరు సభ్యులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఫలితంగా వన్డే సిరీస్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలు చూసుకుని ఈ సిరీస్‌ను తిరిగి నిర్వహిస్తామని తెలిపారు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.