తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో తొలి గెలుపు ఎవరిది..? - ENGLAND AND WALES

ఓవల్ వేదికగా జరిగే ప్రపంచకప్​ తొలి మ్యాచ్​లో దక్షిణాఫ్రికా.. ఆతిథ్య ఇంగ్లాండ్​ను ఢీకొననుంది. రెండు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

ప్రపంచకప్​లో తొలి గెలుపు ఎవరిది..?

By

Published : May 30, 2019, 6:30 AM IST

క్రికెట్ ప్రేమికుల కోసం మరో మెగాటోర్నీ సిద్ధమైంది. ఇంగ్లాండ్​, వేల్స్ వేదికగా నేటి నుంచి ప్రపంచకప్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో ఆతిథ్య ఇంగ్లాండ్.. డుప్లెసిస్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఓవల్ మైదానం ఈ మ్యాచ్​కు వేదిక.

మోర్గాన్ నేతృత్వంలో ఇంగ్లాండ్ జట్టు​ భీకర ఫామ్​లో ఉంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఈ ఫార్మాట్​లో అత్యధిక స్కోరు 481/6 చేసింది ఇంగ్లీష్​ జట్టే కావడం విశేషం.

ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్​జేసన్​ రాయ్, బెయిర్ ​స్టో, రూట్, మోర్గాన్, బట్లర్ ఫుల్ ఫామ్​లో ఉన్నారు. బౌలర్లూ రాణిస్తే ఇంగ్లాండ్​కు తిరుగుండదు.

డుప్లెసిస్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా కప్పు కొట్టాలని ఊవిళ్లూరుతోంది. గత వరల్డ్​కప్​లో సెమీస్​లో ఇంటిముఖం పట్టింది. ఈసారి మాత్రం ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.

బ్యాటింగ్​లోఆమ్లా, డికాక్, డుప్లెసిస్​... బౌలింగ్​లో రబాడా, తాహిర్, ఎంగిడి లాంటి స్టార్లతో కళకళాలాడుతోంది దక్షిణాఫ్రికా జట్టు. తొలి మ్యాచ్​ గెలిచి బోణీ కొట్టాలని చూస్తోంది.

ఇది చదవండి: పాకిస్థాన్​లో ఆసియా కప్.. భారత్​ పాల్గొంటుందా?

ABOUT THE AUTHOR

...view details