ఐసీసీ మొట్టమొదటి ప్రపంచకప్ సూపర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌లో తొలి సిరీస్ అయిన ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ గురువారం జరిగే తొలి మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఈ లీగ్‌లోని 13 జట్లు 8 ప్రత్యర్థి జట్లతో సిరీస్ (ఇంట 4, బయట 4)లు ఆడతాయి.
నేటి నుంచే ఇంగ్లాండ్-ఐర్లాండ్ వన్డే సిరీస్ - ఐసీసీ సూపర్ లీగ్
నేటి నుంచి ఐసీసీ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్-ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు మొదలవనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
నేటి నుంచే ఇంగ్లాండ్-ఐర్లాండ్ వన్డే సిరీస్
తొలి ఏడు స్థానాల్లో నిలిచిన జట్లు, ఆతిథ్య భారత్ నేరుగా 2023 ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. అడుగున నిలిచిన ఐదు జట్లు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఆడతాయి. సాయంత్రం 6.30కు ఆరంభమయ్యే ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్ ప్రసారం చేయనుంది.