భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ మరో ఆటగాణ్ని జట్టులో చేర్చుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒలీ పోప్ బుధవారం జట్టులోకి వచ్చాడు. 23 ఏళ్ల పోప్.. నిరుడు ఆగస్టులో పాకిస్థాన్‌తో టెస్టు సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. భుజానికి శస్త్రచికిత్స అవసరమైంది. గాయం నుంచి కోలుకున్న అతడు.. ఇంగ్లాండ్ జట్టులో లేకున్నా ఆ జట్టుతో పాటు శ్రీలంక పర్యటనకు వెళ్లాడు.
భారత్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులోకి ఒలీ పోప్ - england cricket board
భారత్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా.. ఇంగ్లాండ్ మరో ఆటగాణ్ని తమ జట్టులోకి తీసుకుంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒలీ పోప్‌ను టీమ్‌లోకి తీసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
భారత్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టులోకి ఒలీ పోప్
భారత్‌కూ వచ్చిన అతడు ఇంగ్లాండ్ జట్టుతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. తొలి టెస్టులో పోప్ ఆడే అవకాశముంది.
ఇదీ చదవండి:'పంత్ ఆట సెహ్వాగ్‌ను తలపిస్తుంది'