లీడ్స్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4-0 తేడాతో గెలుచుకుని ప్రపంచకప్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ బట్లర్, స్పిన్నర్ ఆదిల్ రషీద్.. పాక్ బ్యాట్స్‌మెన్‌ను రనౌట్ చేసే క్రమంలో ధోనిని తలపించారు. ఆ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ధోనిని తలపించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు - ఇంగ్లండ్
పాకిస్థాన్‌తో జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ క్రికెటర్లు చేసిన రెండు రనౌట్లు క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అచ్చం ధోనిలాగే చేసి ఇద్దరు పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు పంపారు.
352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. 27 ఓవర్లో రషీద్ వేసిన బంతిని డిఫెన్స్ ఆడి పరుగు తీసేందుకు ప్రయత్నించాడు సర్ఫరాజ్. నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో ఉన్న బాబర్ ఆజమ్ పరుగు తీయబోతూ వెనక్కి వచ్చేశాడు. ఆ సమయంలోనే కీపర్ బట్లర్.. రషీద్‌కు బంతిని అందించాడు. వికెట్లను చూడకుండానే గిరాటేసి అతడ్ని ఔట్ చేశాడు రషీద్.
ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ శతకం చేజార్చుకున్నాడు. దానికి కారణం ఇంగ్లాండ్ కీపర్ బట్లర్. సర్ఫరాజ్ బంతిని స్లిప్‌లోకి ఆడబోయాడు. వేగంగా కదిలిన బట్లర్ ధోని స్టైల్లో కాలితో బంతిని ఆపాడు. వెంటనే స్పందించి సర్ఫరాజ్‌ను రనౌట్ చేశాడు.