తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​ క్రికెటర్​కు స్ట్రెయిన్ వైరస్​​​.. మ్యాచ్​ యథాతధం - ఇంగ్లాండ్​ vs శ్రీలంక వార్తలు

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ మోయిన్​ అలీకి ఇటీవలే కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అయితే అది యూకే స్ట్రెయిన్​ కేసుగా గుర్తించినట్లు లంక వైద్యులు స్పష్టం చేశారు. వైరస్​ సోకిన ఆటగాడిని ప్రత్యేక క్వారంటైన్​కు తరలించామని వెల్లడించారు.

England Cricketer Moeen Ali infected with uks new corona strain virus
ఇంగ్లాండ్​ క్రికెటర్​కు స్ట్రెయిన్​​.. మ్యాచ్​ యథాతధం

By

Published : Jan 14, 2021, 10:46 AM IST

Updated : Jan 14, 2021, 11:41 AM IST

శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టులో ఒక ఆటగాడికి యూకే కరోనా స్ట్రెయిన్‌ సోకిందని అక్కడి అధికారులు గుర్తించారు. దీంతో అతడిని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించామని చెప్పారు.

తొలి స్ట్రెయిన్​ కేసు

తొలుత ఇంగ్లాండ్​ ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీకి పాజిటివ్‌గా తేలిందని, అది యూకే స్ట్రెయిన్‌గా గుర్తించామని లంక వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అయితే, శ్రీలంకలో ఇదే తొలి యూకే స్ట్రెయిన్‌ కేసు అని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందన్న నేపథ్యంలో గట్టి చర్యలు తీసుకున్నామన్నారు.

యథావిధిగా సిరీస్​

అంతకుముందు మిగతా ఆటగాళ్లకు నెగెటివ్‌ రావడం వల్ల గురువారం నుంచి టెస్టు సిరీస్ యథావిధిగా కొనసాగుతందని చెప్పారు. మరోవైపు అలీతో సన్నిహితంగా ఉన్న క్రిస్‌వోక్స్‌కు నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. అయితే, వోక్స్‌ తొలి టెస్టులో ఆడడం సందేహంగా ఉంది.

ఇంగ్లాండ్​, శ్రీలంకల మధ్య జరగాల్సిన రెండు టెస్టుల సిరీస్​ నేటి (గురువారం) నుంచి ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కన్నా ముందే ఈ సిరీస్‌ జరగాల్సి ఉన్నా కరోనా నేపథ్యంలో వాయిదా వేశారు. క్రికెట్‌ మళ్లీ మొదలయ్యాక సిరీస్​ను నిర్వహించడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఈ క్రమంలోనే జనవరి 4న అక్కడ అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు కరోనా టెస్టులు చేశారు.

ఇదీ చూడండి:శ్రీలంకతో టెస్టు.. ఇంగ్లాండ్​ జట్టులో కరోనా కలవరం!

Last Updated : Jan 14, 2021, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details