తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుత్రోత్సాహంలో మోర్గాన్...కొడుకు పేరేంటో తెలుసా? - Eoin Morgan news

ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్, తన భార్య తారా దంపతులకు మార్చి 9న మగబిడ్డ పుట్టాడు. తాజాగా అతడి ఫొటోను అభిమానులతో పంచుకున్న తారా​.. బాబుకు పెట్టిన పేరును సామాజిక మాధ్యమాల్లో ప్రకటించింది.

England Cricketer Eoin Morgan And Wife Blessed With Baby Boy On March 9, Named as Leo louis oliver morgan
నలుగురు పేర్లు కలిపితే ఇయాన్​ మోర్గాన్​ బిడ్డ పేరు?

By

Published : Mar 19, 2020, 9:45 PM IST

ఇంగ్లాండ్​కు తొలిసారి క్రికెట్​ వరల్డ్​కప్​​ అందించిన కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​... తొలిసారి తండ్రయ్యాడు. ఈ నెల 9న తన భార్య తారా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. తన బాబు ఫొటోను షేర్​ చేస్తూ... ఆ చిన్నోడికి 'లియో లూయిస్​ ఒలీవర్ మోర్గాన్​​' అనే పేరు పెట్టినట్లు తెలిపారు ఈ దంపతులు. సామాజిక మాధ్యమాల్లో మోర్గాన్​కు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.

ఇయాన్​ మోర్గాన్​ కొడుకు

ప్రేమపరిణయం..

2010లో యాషెస్​ మ్యాచ్​లు చూసేందుకు ఇంగ్లాండ్​ వచ్చిన తారాతో... తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడట మోర్గాన్​. ఆస్ట్రేలియాకు చెందిన ఈమె.. అప్పట్లో పబ్లిక్​ రిలేషన్స్​ ఆఫీసర్​గా పనిచేసేది. అయితే చాలా రోజులు డేటింగ్​ తర్వాత 2018లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. మోర్గాన్​ ఈ ఏడాది ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్​లో జరిగిన వేలంలో ఇతడిని రూ.5.25 కోట్లు పెట్టి కొనుక్కుంది ఆ జట్టు యాజమాన్యం. ఇప్పటివరకు 52 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడిన ఇతడు.. 854 పరుగులు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details