తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 7:26 PM IST

ETV Bharat / sports

బంతి మెరుపు కోసం చెమట వాడుతున్న ఇంగ్లీష్​ బౌలర్లు

బంతికి మెరుపు తెప్పించడానికి లాలాజలానికి బదులుగా చెమటను వాడనున్నామని ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్​ వుడ్​ వెల్లడించాడు. అలాగే వెస్టిండీస్ బ్యాట్స్​మన్​ను కట్టడి చేయడానికి తగిన ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపాడు.

England bowlers using 'back sweat' to shine the ball
బంతిమెరుపుకు చెమటను వాడుతున్న ఇంగ్లీష్​ బౌలర్లు

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని క్రికెట్​లో బంతి మెరుపు కోసం లాలాజలం వాడటం నిషేధమని అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ఇప్పటికే ప్రకటించింది. దీంతో బంతిని స్వింగ్​ చేయడానికి ఉమ్మి ఎంతో ముఖ్యమని కొంతమంది బౌలర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఐసీసీ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని లాలాజలం బదులుగా చెమటను వాడనున్నట్లు ఇంగ్లాండ్​ బౌలర్​ మార్క్​ వుడ్​ వెల్లడించాడు.

"కరోనా కారణంగా బంతికి లాలాజలాన్ని రాయడం నిషేధించడం వల్ల దానికి ప్రత్యామ్నాయంగా చెమటను రాసి బంతికి మెరుపు తెప్పిస్తాం. అండర్సన్​, జోఫ్రా ఆర్చర్​లతో పాటు నేనూ అదే పని చేయనున్నా".

-మార్క్​ వుడ్​, ఇంగ్లాండ్​ బౌలర్​

వెస్టిండీస్​తో జరుగుతోన్న మొదటి టెస్టు​ తొలి ఇన్నింగ్స్​లో 204 పరుగులకే ఇంగ్లాండ్​ ఆలౌట్​ అయ్యింది. "ఈ మ్యాచ్​లో మాకు తగిన సమయం రాలేదు. విండీస్​ ఆటగాళ్లు బాగా బౌలింగ్​ చేశారు. క్రెడిట్​ అంతా వాళ్లకే దక్కుతుంది. కానీ, 204 అనేది చాలా చిన్న టార్గెట్​. 250 నుంచి 300 పరుగుల వరకు మేము ఆశించాం. ప్రత్యర్థులు మంచి లైన్​ అండ్​ లెన్త్​తో బౌలింగ్ చేశారు." అని తెలిపాడు వుడ్.

ABOUT THE AUTHOR

...view details