తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ డేవిడ్ విల్లేకు కరోనా - డేవిడ్ విల్లే కరోనా

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ డేవిడ్ విల్లే కరోనా బారిన పడ్డాడు. విల్లేతో పాటు అతడి భార్యకు వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం క్వారంటైన్​లో ఉన్నారు.

England all-rounder David Willey tests positive for COVID-19
డేవిడ్ విల్లే

By

Published : Sep 18, 2020, 11:39 AM IST

ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ డేవిడ్ విల్లే కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. విల్లేతో పాటు అతడి భార్యకు పాజిటివ్​గా తేలింది. వీరు ప్రస్తుతం హోం క్వారంటైన్​లో ఉన్నారు.

"నాకు మద్దతుగా నిలుస్తూ ప్రార్థనలు చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. నాాతో పాటు నా భార్యకు టెస్టుల్లో కరోనా పాజిటివ్​గా తేలింది" అని తెలిపాడు విల్లే.

ప్రస్తుతం విల్లే యార్క్​షైర్ తరఫున విటలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఆడుతున్నాడు. ఇతడికి కరోనా తేలడం వల్ల మిగిలిన గ్రూప్ మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదు. ఇతడితో పాటు మరో ముగ్గురు కూడా మిగిలిన మ్యాచ్​లను ఆడట్లేదని యార్క్​షైర్ యాజమన్యం స్పష్టం చేసింది. విల్లేకు కరోనా నిర్ధరణ అయ్యేముందు అతడు వీరితో కలిసి ఉండటమే కారణం. మిగిలిన ముగ్గురిని 14 రోజులు ఐసోలేషన్​లో ఉండాలని అధికారులు సూచించారు.

విల్లే ఇంగ్లాండ్ తరఫున 49 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. గత నెల ఐర్లాండ్​తో జరిగిన వన్డే సిరీస్​లో చివరిసారిగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే 2018 ఐపీఎల్​లో చెన్నై సూపర్ కింగ్స్​కు ఆడాడు.

ABOUT THE AUTHOR

...view details