బయోసెక్యూర్ వాతావరణంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. కరీబియన్ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
విండీస్ కెప్టెన్, ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ 6 వికెట్లతో విజృంభించాడు. గాబ్రియెల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ (43; 93 బంతుల్లో 7×4) అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
తొలిరోజు తర్వాత
ఓవర్‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ కాసేపటికే జో డెన్లీ (18; 58 బంతుల్లో 4×4) వికెట్ చేజార్చుకుంది. 23 వ ఓవర్ 2వ బంతికి అతడిని షానన్ గాబ్రియెల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్ రోరీ బర్న్స్ (30; 85 బంతుల్లో 4×4)ను సైతం అతడికే వికెట్ల ముందు ఎల్బీడబబ్ల్యూ రూపంలో దొరికాడు. ఆ తర్వాత విండీస్ కెప్టెన్ హోల్డర్ వికెట్ల పతనం మొదలుపెట్టాడు. జాక్ క్రాలీ (10; 26 బంతుల్లో 2×4), ఒలివ్ పోప్ (12; 13 బంతుల్లో 2×4)ను పెవిలియన్ పంపించాడు.