కరోనా ప్రభావం తర్వాత జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. దీంతో టాస్కు అంతరాయం కలిగింది. సౌతాంప్టన్ వేదికగా జరగాల్సిన తొలి టెస్టు.. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కావాల్సింది. కానీ చిరు జల్లులతో పాటు మబ్బులు కమ్మేయడం వల్ల వెలుతురు లేమి వల్ల మ్యాచ్ నిర్వహణలో జాప్యం జరుగుతుంది.
ఇంగ్లాండ్-వెస్టిండీస్ టెస్టుకు వర్షం అంతరాయం - ఇంగ్లాండ్, వెస్టిండీస్ టెస్టు అంతరాయం
ఇంగ్లాండ్-వెస్టిండీస్ తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగింది. చిరుజల్లులు పడటం సహా మబ్బులు కమ్మేయడం వల్ల టాస్ ఆలస్యమైంది. కరోనా ప్రభావం ఉండటం వల్ల దీనిని, ప్రేక్షకులు లేకుండా బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహిస్తున్నారు.
వర్షం కారణంగా వెస్టిండీస్, ఇంగ్లాండ్ టెస్టుకు అంతరాయం
అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉందని సౌతాంప్టన్ వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో దాదాపు నాలుగు నెలల నుంచి లైవ్ క్రికెట్ మ్యాచ్ చూద్దామనుకున్న క్రికెట్ ప్రేమికులకు కాస్త నిరాశే ఎదురైంది.
ఇదీ చూడండి... బయోసెక్యూర్ వాతావరణంలో ఇంగ్లాండ్ X విండీస్ మ్యాచ్
Last Updated : Jul 8, 2020, 5:55 PM IST