తొలి టెస్టులో అనూహ్యంగా దెబ్బతిన్న ఇంగ్లాండ్.. రెండో టెస్టులో పుంజుకుని వెస్టిండీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ నేపథ్యంలో మూడో మ్యాచ్‌లో విజయం ఎవరివైపు నిలుస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాంచెస్టర్ వేదికగా నిర్ణయాత్మక టెస్టు జరగనుంది. విజ్డెన్ ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా పోరాడే అవకాశాలున్నాయి.
వెస్టిండీస్..
అంతకుముందు వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో విజ్డెన్ ట్రోఫీని ముద్దాడింది ఆతిథ్య జట్టు. ప్రస్తుతం జరుగుతోన్న సిరీస్‌లో గెలుపొందినా లేదా మ్యాచ్‌ను డ్రా గా ముగించి కప్పు తమ దగ్గరే పెట్టుకోవాలని భావిస్తోంది విండీస్.
ఇంగ్లాండ్
గతసారి జరిగిన విజ్డెన్ ట్రోఫీలో వెస్డిండీస్‌పై ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇంగ్లీష్ జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పును ముద్దాడాలనే తపనతో ఉంది.
ప్రస్తుత సిరీస్ తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని అందుకున్న రూట్ సేన.. రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లీష్ జట్టు.. 198 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్. అయితే మూడో టెస్టులోనూ ఎలాగైనా ప్రత్యర్థి జట్టును మట్టికరిపించి ట్రోఫీని అందుకోవాలని చూస్తోంది ఇంగ్లాండ్.