తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంతికి లాలాజల వినియోగం.. అంపైర్ల శానిటైజ్ - umpires sanitise ball

ఓల్డ్​ ట్రాఫోర్డ్ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో ఇంగ్లాండ్​ క్రికెటర్​ డొమినిక్​ సిబ్లే అనుకోకుండా బంతిపై లాలాజలం ఉపయోగించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అంపైర్లు.. బంతికి శానిటైజేషన్​ చేశారు.

Eng vs WI, 2nd Test: Umpires sanitise ball after Sibley's saliva gaffe
లాలాజలం వినియోగంతో బంతికి శానిటైజేషన్​ చేస్తున్న అంపైర్లు

By

Published : Jul 19, 2020, 8:58 PM IST

ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ జట్ల మధ్య ఓల్డ్​ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు సిరీస్ నాలుగో రోజు ఊహించని సంఘటన జరిగింది. ఇంగ్లాండ్​ క్రికెటర్​ డొమినిక్​ సిబ్లే అనుకోకుండా బంతిపై లాలాజలం ఉపయోగించాడు. దీంతో అక్కడే ఉన్న అంపైర్లు అప్రమత్తమై బంతికి శానిటైజేషన్​ చేయాల్సి వచ్చింది. అంపైర్​ మైఖేల్​ గోఫ్​ ఓ టిష్యూ పేపర్​ తీసుకొని బంతికి ఇరువైపులా శుభ్రం చేశాడు.

లాలాజలం వినియోగంతో బంతికి శానిటైజేషన్​ చేస్తున్న అంపైర్లు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెట్​లో బంతి మెరుపు కోసం లాలాజలం వినియోగాన్ని నిషేధించాలని ఐసీసీ గతంలో ఆదేశించింది. అయితే, చెమటను ఉపయోగించొచ్చని పేర్కొంది. ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్​ సమయంలో బంతిపై అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా కానీ.. లాలాజలం ఉపయోగించిన సందర్భంలో సంబంధిత జట్టును ముందుగా హెచ్చరిస్తారు. అలా రెండు సార్లు వార్నింగ్ ఇచ్చిన అనంతరం వినకపోతే.. జరిమానా కింద ఐదు పరుగుల కోత విధిస్తారు.

లాలాజలం వినియోగంతో బంతికి శానిటైజేషన్​ చేస్తున్న అంపైర్లు

ఇదీ చూడండి:'ధోనితో పోలిస్తే గంగూలీ ఆ విషయంలో ఉత్తమం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details