క్రికెట్లో హిట్ వికెట్‌గా ఔట్ కావడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ శుక్రవారం జరిగిన ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఔటైన తీరు భిన్నంగా ఉంది. బంతిని ఆఫ్‌సైడ్ ఆడే క్రమంలో వికెట్లను బ్యాట్‌తో కొట్టాడీ క్రికెటర్. దీనిపై స్పందించిన నెటిజన్లు అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
గ్రౌండ్లో హిట్ వికెట్... నెట్లో ట్రోల్ టార్గెట్ - jason roy
శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. సామాజిక మాధ్యమాల్లో అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
హిట్ వికెట్ వెనుదిరిగిన పాక్ క్రికెటర్
నాటింగ్హమ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. పాక్‌పై మూడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో సొంతం చేసుకుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దయింది.
పాకిస్థాన్ జట్టులో బాబర్ అజమ్ 115 పరుగులతో ఆకట్టుకోగా, ఛేదనలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్ 114, బెన్ స్టోక్స్ 71 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.