ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇప్పటికే 0-1తో వెనకబడిన పాకిస్థాన్.. చివరి టెస్టు మీదా ఆశలు వదులుకున్నట్లే. మూడో టెస్టులో ఆ జట్టును ఇంగ్లాండ్ ఫాలోఆన్ ఉచ్చులో బిగించింది. పాక్ ప్రత్యర్థికి 310 పరుగుల ఆధిక్యం సమర్పించుకుంది. కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్; 272 బంతుల్లో 21x4) సెంచరీతో జట్టును ఆదుకున్నప్పటికీ, మిగతా ప్రధాన బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం వల్ల పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులకే ఆలౌటైంది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా 310 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్న పాక్.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవడమూ అంత తేలిక కాకపోవచ్ఛు నాలుగో రోజే మ్యాచ్ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (583/8 డిక్లేర్డ్)కు బదులుగా ఓవర్‌నైట్ స్కోరు 24/3తో మూడో రోజు, ఆదివారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్.. ఒక దశలో 75 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో కెప్టెన్ అజహర్ అలీ జట్టును కుప్పకూలకుండా కాపాడాడు. అతనికి తోడు రిజ్వాన్ (53) రాణించడం వల్ల పాక్ 213/5తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఫాలోఆన్ ప్రమాదం తప్పించుకోలేకపోయింది. అండర్సన్ (5/56) ఆ జట్టును దెబ్బ తీశాడు.
అంతకుముందు జాక్ క్రాలే (267; 393 బంతుల్లో 344, 16) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ చేయడం వల్ల ఇంగ్లాండ్ 583/8 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. క్రాలేకు తోడు బట్లర్ (152; 311 బంతుల్లో 134, 26) శతకంతో మెరిశాడు.
క్రాలే మారథాన్ ఇన్నింగ్స్