ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో ఘోర పరాభావంతో రెండో టెస్ట్ ఆరంభించిన టీమ్ ఇండియా.. రెండో టెస్ట్‌లో ప్రతీకారం దిశగా ముందడుగేస్తోంది. రెండో రోజే పర్యాటక జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత జట్టు.. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో చివరి సెషన్లో బ్యాటింగ్ ఆరంభించిన ఆతిథ్య టీమ్.. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 249పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ (25*)తో పాటు ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన పుజారా(7*) క్రీజులో ఉన్నారు.
రెండో టెస్టులో పట్టు బిగించిన భారత్
చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమ్ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యర్థి టీమ్‌ను ఫాలోఆన్ ఆడించకుండా మరోసారి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది.
అంతకుముందు.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆ జట్టు మరోసారి బ్యాటింగ్‌కు వస్తుందని భావించారు. కానీ.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే వ్యూహంతో.. ఫాలోఆన్ ఆడించకుండానే భారత్ బ్యాట్స్‌మెన్ క్రీజులోకి అడుగుపెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్(14) నిలకడగా బ్యాటింగ్ చేస్తూ.. నిలదొక్కుకునే క్రమంలోనే జాక్ లీచ్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 42 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది టీమ్ ఇండియా.
ఇదీ చదవండి:చెన్నై టెస్ట్‌లో తిప్పేసిన భారత్- ఇంగ్లండ్ 134 ఆలౌట్