ఐపీఎల్ ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న సురేశ్ రైనాపై తాను కోపంగా ఉన్నాననే వార్తలను చెన్నై సూపర్‌కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ ఖండించారు. రైనాను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను చాలామంది తప్పుగా అర్థంచేసుకున్నారని స్పష్టం చేశారు. అతడిపై ఎలాంటి కోపం లేదని చెప్పారు. తమ జట్టు ఎప్పుడు అతడికి అండగా నిలుస్తుందని వివరణ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీజన్‌కు రైనా దూరమయ్యాడని వెల్లడించారు.
"జట్టు ఆటగాళ్లందరూ కుటుంబసభ్యులాంటి వారు. దాదాపు పదేళ్ల నుంచి కలిసి ఉన్నాం. ఆటగాళ్లకు విజయం తలకెక్కడం సహజమేనని రైనా గురించి అన్నాను. కానీ అవి ప్రతికూల భావంతో అనలేదు. రైనా గొప్ప ఆటగాడు. అతడికి మా జట్టు ఎప్పుడు అండగా ఉంటుంది"