వైదొలగక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఏడాది కాలం టీమ్‌ఇండియా కోచ్ పదవిని ఆస్వాదించానని దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే తెలిపాడు. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ముంబయి ఇండియన్స్ మెంటార్ పదవి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించాడు. ఈ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో పనిచేసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వెల్లడించాడు.
"టీమ్‌ఇండియా కోచ్ పదవికి ఎంపికైనందుకు ఎంతో సంతోషించా. చాలా గొప్పగా అనిపించింది. జట్టు సభ్యులతో గడిపిన ఏడాది కాలం అమూల్యం. అద్భుతంగా ఆడే క్రికెటర్లతో మరోసారి డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడం ఆనందకరమైన అనుభూతి. " అని కుంబ్లే అన్నాడు.
సారథి విరాట్ కోహ్లీ, కోచ్ అనిల్ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా కుంబ్లే తరహా క్రమశిక్షణ విరాట్‌కు నచ్చలేదు! ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడం వల్ల కుంబ్లేనే హుందాగా పదవి నుంచి తప్పుకున్నాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
ముంబయి ఇండియన్స్ కోచింగ్ బృందంలో